Warangal: మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు
Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Warangal: మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు
వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారు హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని విష్ణు రెడ్డి గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు,డివిజన్ అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




