Warangal: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హౌస్ అరెస్ట్
Warangal: చలో అసెంబ్లీకి వెళ్లకుండా తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు.
Warangal: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హౌస్ అరెస్ట్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్రరావు గారి పిలుపు మేరకు నేడు చేపట్టిన “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు.
చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు మిల్స్ కాలనీ పోలీసులు శివనగర్‌లోని తన నివాసంలో తనను హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత ఖండనీయమని ఆయన మండిపడ్డారు. -పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల పోరాటాలను అణచివేయాలని కాంగ్రెస్ పాలకులు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.




