Warangal: కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి రావు పద్మారెడ్డి

Warangal: వరంగల్ అభివృద్ధికి కేంద్రమే కొండంత అండని స్పష్టం చేసిన బీజేపీ నాయకురాలు రావు పద్మారెడ్డి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Aug 2026 5:46 PM IST
Warangal
X

Warangal: కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి రావు పద్మారెడ్డి

వరంగల్: వరంగల్ పశ్సీమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ క్రెడిట్ కొట్టేయడం తప్ప, నగర అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఆయన చేసిందేమీ లేదని తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా శ్రీమతి రావు పద్మారెడ్డి మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని స్పష్టం చేశారు.

స్మార్ట్ సిటీ పథకం ద్వారా ₹500 కోట్ల నిధులతో నయీమ్ నగర్ నాలా, 100 ఫీట్ రోడ్ డక్ట్, ప్రధాన రోడ్లు, పబ్లిక్ గార్డెన్, సెంట్రల్/రీజినల్ లైబ్రరీల పునర్నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి మరియు వడ్డేపల్లి చెరువు కట్ట అభివృద్ధి పనులు చేశామని,

రైల్వే ప్రాజెక్టులు & మౌలిక వసతులు కల్పన, రవాణా & ఇతర అభివృద్ధి నిధులలో భాగంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ₹521.36 కోట్లు, కాజీపేట స్టేషన్ అభివృద్ధికి ₹24.45 కోట్లు, విజయవాడ-బల్లార్షా 3వ రైల్వే లైన్లకు దాదాపు ₹4,850 కోట్లకు పైగా నిధులు మరియు కాజీపేట బైపాస్ లైన్‌కు ₹125 కోట్లను కేంద్రం మంజూరుచేసింది అని, మామునూర్ ఎయిర్‌పోర్ట్ మొదటి విడత పనులకు ₹500 కోట్లు, ఔటర్ రింగ్ రోర్డ్ (నార్త్ సైడ్) నిర్మాణానికి ₹30 కోట్లు, నగర రవాణా కోసం 'PM ఈ-బస్' పథకం కింద 100 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయి ఇవే కాకుండా ఇటీవల మరో 100 విధ్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలియజేసారు.

ప్రజా సంక్షేమం & పట్టణాభివృద్ధి కోసం PM స్వనిధి ద్వారా 62,937 మంది వీధి వ్యాపారులకు ₹117.56 కోట్ల రుణాలు ఇచ్చారు అని, హృదయ్ (HRIDAY) పథకం కింద ₹33 కోట్లు, అమృత్ (AMRUT) స్కీమ్ కింద మంచి నీటి సరఫరాకు ₹274.25 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఛాలెంజ్ ఫండ్ ద్వారా ₹1,550 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసారని స్పష్టం చేసారు.

ఈరోజు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క 14, 15, మరియు 16వ ఆర్థిక సంఘం (Finance Commission) నిధులతోనే నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల నిర్మాణం జరుగుతోందని, చివరికి ఎమ్మెల్యే రెండురోజుల క్రితం, దర్గాలో ప్రారంభించిన ₹50 లక్షల సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులు కూడా కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులేనని తేల్చిచెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

కేంద్రం ఇస్తున్న వేల కోట్ల నిధులను మళ్లించడం లేదా తమ ఖాతాలో వేసుకోవడం మాని, అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తే, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం, వరంగల్ నగర అభివృద్ధి మాత్రమే బిజెపి ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story