Warangal: వరంగల్‌లో ఘనంగా వికసిత్ సంకల్ప సభ మరియు సేవా జ్యోతి కలశయాత్ర
Warangal: వరంగల్ చౌరస్తాలో మోదీ 25 ఏళ్ల ప్రజాపాలన సందర్భంగా 'వికసిత్ సంకల్ప సభ', సేవా జ్యోతి కలశయాత్ర. బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు హాజరు.
Warangal: వరంగల్‌లో ఘనంగా వికసిత్ సంకల్ప సభ మరియు సేవా జ్యోతి కలశయాత్ర
Warangal: ప్రజాసేవలో ప్రధాని మోడీ గారి పాతికేళ్ల ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయి:- బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.
వరంగల్ చౌరస్తాలో ఘనంగా ‘వికసిత్ సంకల్ప సభ’ – సేవా జ్యోతి కలశయాత్రను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.
-వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ ప్రస్థానం.
-భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారి ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి గారి అధ్యక్షతన వరంగల్ చౌరస్తాలో బుధవారం "వికసిత్ సంకల్ప సభ" కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
-ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాపాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అరుదైన, అద్భుతమైన మైలురాయి అని నాయకులని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రధాని మోడీ గారి పాలన ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మారిందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని 'వికసిత్ భారత్' గా మార్చేందుకు ప్రధాని చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.
-దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తరలివచ్చిన ప్రజలు మరియు కార్యకర్తలు స్క్రీన్‌లపై వీక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, జిల్లా ఇన్‌చార్జ్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు గార్లు హాజరయ్యారు.
-ప్రధాని మోడీ గారి ప్రసంగం దేశాభివృద్ధికి, వికసిత భారత్ నిర్మాణానికి దిక్సూచిలా నిలిచిందని, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
-ప్రధాని ప్రసంగం అనంతరం, సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ చౌరస్తాలో "సేవా జ్యోతి కలశయాత్ర"ను నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ యాత్ర వరంగల్ చౌరస్తా నుండి కొత్తవాడ వరకు కార్యకర్తల నినాదాలు, దేశభక్తి స్ఫూర్తితో ఉత్సాహంగా సాగింది.
-జకోటియ కాంప్లెక్స్ ఎదురుగా గల జంక్షన్‌కు చేరుకున్న అనంతరం జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం సేవకు ప్రతీకగా తీసుకొచ్చిన సేవా జ్యోతిని ఆ జంక్షన్ వద్ద ప్రతిష్టించారు. ఈ సందర్భంగా సదరు కూడలికి బీజేపీ శ్రేణులు "వికసిత్ సేవా జ్యోతి జంక్షన్" అని నామకరణం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, సేవా జ్యోతి రాష్ట్ర కో కన్వీనర్ సిద్ధం నరేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎర్రగోల్ల భరత్ వీర్, కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్ మరియు జిల్లా పదాధికారులు వివిధ మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు కార్యకర్తలు, మహిళలు, నగర ప్రజలు పాల్గొన్నారు.




