Warangal: విషం కలిపారా? ఊపిరాడలేదా?.. వరంగల్‌లో లక్షలాది చేపల మృతిపై అనుమానాలు!
Warangal: వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువులో సుమారు 30 లక్షల రూపాయల విలువైన 10 టన్నుల చేపలు మృతి.
Warangal: విషం కలిపారా? ఊపిరాడలేదా?.. వరంగల్‌లో లక్షలాది చేపల మృతిపై అనుమానాలు!
Warangal: చిన్న వడ్డేపల్లి చెరువులో సుమారు 30 లక్షల రూపాయల విలువచేసే చేపలు చనిపోయాయని వరంగల్ మత్స్యకార సంఘం నాయకులు సుధాకర్ అన్నారు. వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు లో చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 టన్నుల చాపలు మృతిచెందాయని, చేపల మృతికి కారణాలు ఆక్సిజన్ అందకనా లేక ఎవరైనా కలిపారా అనే సందేహం వ్యక్తం అవుతుందని మరోవైపు 100 ఎకరాలలో ఉన్న చిన్న వడ్డేపల్లి చెరువు విస్తీర్ణం ఆక్రమణ లకు గురై 35 నుండి 40 ఎకరాలకు పరిమితమైందని దీనికి తోడు బండ్ అభివృద్ధి పేరుతో కూడా మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా నీటిని తీశారని దీంతో చాపలు మృతి చెంది ఉండవచ్చునని నిన్నటి నుండి చేపలు చనిపోతున్న కనీసం అటు మత్సరక అధికారులు గాని ఇటు రెవెన్యూ గాని అటు మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని ఇప్పటికే ఫిషరీస్ అధికారులకు ఫిర్యాదు చేశామని వారు కూడా స్పందించడం లేదని ఇప్పటికైనా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లేదా ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




