Warangal: పోచమ్మ మైదాన్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Warangal: వరంగల్ పోచమ్మ మైదాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్, మహిళలకు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 8 Nov 2026 4:54 PM IST
Warangal
X

Warangal: పోచమ్మ మైదాన్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్: పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చీరల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ మీసాల ప్రకాష్, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST