Rayaparthy: మైలారం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్!
Rayaparthy: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం సందర్శించి తనిఖీ చేశారు.
Rayaparthy: మైలారం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్!
రాయపర్తి: రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి పాఠశాలలో విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, వారికి అందిస్తున్న పౌష్టికాహారం, పోషకాహార పంపిణీ వివరాలను పరిశీలించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.
ఈ పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజి రెడ్డి,ఐడి ఎస్సీ కార్పొరేషన్ సురేష్, తహసిల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో శ్రీనివాస్, డిఇ ఓ ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.




