Warangal: ఎల్ నినో ప్రభావంపై పాటల సీడీని ఆవిష్కరించిన కలెక్టర్!
Warangal: ఎల్ నినో ప్రభావం, నివారణ చర్యలపై తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన పాటల సీడీని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
Warangal: ఎల్ నినో ప్రభావంపై పాటల సీడీని ఆవిష్కరించిన కలెక్టర్!
వరంగల్: రాష్ట్రా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావం నివారణ ఒక్కటే ప్రాముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ మరియు సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోఎల్ నినో ప్రభావం పై పాటలు రాసిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు చేసిన పాటల సిడి సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారి చే ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎల్ నీలో అనేది దాని ప్రభావం పై ప్రజలకు,అలాగే వ్యవసాయ ఉద్యాన వన పంటల సాగు, విబిజిరాంజీ పథకం పై ఇంకుడు గుంతల,ఊట కుంటాలు,పంట కుంటలు పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత, రచయితలు తాళ్ల సునీల్ పడిదం రాజేందర్,నెల్లుట్ల సుమన్, గొలుసుల రంజిత్, జూపాక శివ, మరియు వరంగల్ జిల్లా తెలంగాణా సాంస్కృతిక సారధి కళా కారులు పాల్గొన్నారు.




