Warangal: వరంగల్‌లో 2K రన్ సందడి.. ఓటు హక్కుపై కలెక్టర్ కీలక పిలుపు!

Warangal: వరంగల్‌లో ఘనంగా 2K రన్. ఓటర్ల సర్వే (SIR)పై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 25 నుంచి సర్వే ప్రారంభం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 21 Jun 2026 1:58 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో 2K రన్ సందడి.. ఓటు హక్కుపై కలెక్టర్ కీలక పిలుపు!

Warangal: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరంగల్ ఐడిఓసి నుంచి కాశిబుగ్గ సర్కిల్ వరకు 2కే రన్ ర్యాలీ నిర్వహించారు.

కలెక్టర్ కామెంట్స్

ప్రజలందరూ తమ ఓటును ఓటర్ జాబితాలో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్ పై ఉందన్నారు. ఈ 2 కే రన్ ద్వారా సర్ (SIR) పై అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేశాం అన్నారు.

ఈనెల 25 నుంచి ఎస్ఐఆర్ మొదలవుతుందన్నారు. . మొదటి నెల మొత్తం ఇమ్యురేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి బి ఎల్ ఓ తో పాటు SIR కి సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు ప్రజలందరూ 12 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. దీనివల్ల మన ఓటు హక్కు ఓటర్ జాబితాలో భద్రపరచడం జరుగుతుందన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story