Warangal: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Warangal: దీపావళి పండుగను పురస్కరించుకుని వరంగల్ జిల్లా ప్రజలు, అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుభాకాంక్షలు తెలిపారు. సురక్షితంగా జరుపుకోవాలని సూచన.

MD. AMEER, WARANGAL EAST
Published on: 7 Nov 2026 9:44 PM IST
Warangal
X

Warangal: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్: దీపావళి పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST