Narsampet: కలెక్టర్ సత్య శారద పర్యటన ఓటరు సర్వే, స్కూల్ ఆకస్మిక తనిఖీ!

Narsampet: కలెక్టర్ డా. సత్యశారద నర్సంపేటలో పర్యటించారు. జడ్పీహెచ్ఎస్ మోడల్ స్కూల్‌ను సందర్శించడంతో పాటు బీఎల్ఓల ఇంటింటి ఓటరు సర్వేను పరిశీలించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 July 2026 4:57 PM IST
Narsampet
X

Narsampet: కలెక్టర్ సత్య శారద పర్యటన ఓటరు సర్వే, స్కూల్ ఆకస్మిక తనిఖీ!

Narsampet: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. సత్యశారద గురువారం నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్, సాయినగర్ కాలనీ 149,156,159 పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటించి బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓలు) ఇంటింటి సర్వేను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి అయిన ఓటర్ల వివరాల నమోదు పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి బీఎల్‌ఓల పనితీరుపై ఆరా తీశారు.

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రతి అర్హుడైన ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం లో వివరాలను పరిశీలించి చూడాలని, ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి నిర్దేశిత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని బీఎల్‌ఓలు, పర్యవేక్షణ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ పరిశీలనలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి తాసిల్దార్ హరిచంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story