Warangal: భూముల రీసర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి కలెక్టర్

Warangal: వరరంగల్ జిల్లాలో భూముల రీసర్వే పనులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 23 July 2026 7:02 PM IST
Warangal
X

Warangal: భూముల రీసర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి కలెక్టర్

వరంగల్: భూముల రీసర్వే పనులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించిన భూముల రీసర్వే అవగాహన సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. రీసర్వే విధి-విధానాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, లైసెన్స్ సర్వేయర్ల బాధ్యతలపై సమగ్రంగా సమీక్షించారు.

లైసెన్స్ సర్వేయర్లకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

సర్వేలో Continuous Operating Reference Stations (CORS), Quantum Geographic Information System (QGIS) వంటి ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని, సర్వేయర్లు ఈ సాంకేతికతపై శిక్షణ పొంది నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

భూ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితమైన రికార్డులు రూపొందించాలని, రెవెన్యూ, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. సంధ్యారాణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంచాలకులు ఎం. శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏ. రాజేంద్ర చారి, శాఖ అధికారులు, సిబ్బంది, లైసెన్స్ సర్వేయర్లు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story