Warangal: ఓటు హక్కును దెబ్బతీస్తే ఊరుకోం: డీసీసీ అధ్యక్షుడు అయూబ్!

Warangal: వరంగల్ పోచమ్మైదాన్‌లో కాంగ్రెస్ భారీ నిరసన సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం 'సర్'లో ఏకపక్ష నిర్ణయాలపై రాజీనామా డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 28 Sept 2026 7:57 PM IST
Warangal
X

Warangal: ఓటు హక్కును దెబ్బతీస్తే ఊరుకోం: డీసీసీ అధ్యక్షుడు అయూబ్!

వరంగల్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) శ్రీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వరంగల్ పోచం మైదాన్ సెంటర్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన మరియు దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్, MlC బస్వరాజు సారయ్య, KUDA చైర్మన్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం పాటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తూ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింద.

అనంతరం జిల్లా కమిటీ, మండల, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ గారికి సిఈసి జ్ఞానేష్ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అతను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ వివరాలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మీడియాతో జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, ఎన్నికల వ్యవస్థను రాజకీయంగా పావుగా వాడుకుంటూ అనైతిక రాజకీయాలకు పాల్పడుతుందని బిజెపి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలవాల్సిన ఎన్నికల వ్యవస్థను సైతం బిజెపి పార్టీ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటూ ఓట్ చోరీకి పాల్పడిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ ప్రయత్నాలను దేశ ప్రజలు సహించరని హెచ్చరించారు.

అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కే చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రజల తీర్పును ప్రతిబింబించాలి తప్ప అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారకూడదని అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఇతర కమిషనర్ల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను అడ్డు పెట్టుకుని సర్ పేరుతో బిజెపి పెద్ద ఎత్తున ఓట్ చోరీకి పాల్పడిందని గతంలో ఆధారాలతో సహా రాహుల్ రాహుల్ గాంధీ గారు వివరించారని తెలిపారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలను మిగతా ఇద్దరు కమిషనర్లు గత పది నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు తెలియజేసిన విషయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయట పెట్టడంతో.. రాహుల్ గాంధీ గారు చెప్పిన ఓట్ చోరీ అంశం మరోసారి రుజువైందని అన్నారు.

గతంలో అత్యంత అవినీతి అధికారి ముద్రపడ్డ జ్ఞానేశ్ కుమార్ సీఈసీ గా నియమించడం ద్వారా బీజేపీ ఎన్నికల వ్యవస్థను కలుషితం చేసిందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా లో చిన్న చిన్న కారణాలు చూపించి చాలా వరకు ఓటర్లకు అకారణంగా నోటీసులు ఇచ్చి వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాలరాయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా ప్రజల పక్షాన అయుబ్ గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవీందర్ నాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, మండల అధ్యక్షులు దాడి శివ, ఎండ్ల రవికుమార్, పోశాల వెంకన్న, ఇస్లావత్ సావిత్రి, రవీందర్ రెడ్డి, వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్ డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణాకర్, సయ్యద్ ఇంతియాజ్ డివిజన్ అధ్యక్షుడు, మాడుగుల రాజ్ కుమార్, పసునూరి శ్రవణ్, మొహమ్మద్ జానీ,

కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, గోరంట్ల రాజు, కొత్తపల్లి శ్రీనివాస్, భాషాపాక సదానందం, కూరతోట సదానందం గజ్జల లింగమూర్తి, మన్నే బాబు రావు, కమాలుద్దిన్, మహమూద్ పాష, నాంపల్లి యాదగిరి, శ్రీపాద సతీష్, ఇనుముల బాబు, మాజీ కార్పొరేటర్లు బస్వరాజు శిరీష - శ్రీమాన్, జన్ను శిభారాణి- అనిల్ కుమార్, గుండు చందన-పూర్ణచందర్, బిల్లా శ్రీకాంత్, జన్ను రవి, జన్ను అరుణ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ జాటోత్ శ్రీనివాస్ శ్రీను గౌడ్ తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, టౌన్ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST