Warangal: మత్తు పదార్థాల నిర్మూలనలో వరంగల్ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ భేష్
Warangal: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'డ్రగ్స్ కంట్రోల్ టీమ్' రెండేళ్లలో రూ.8.57 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.
Warangal: మత్తు పదార్థాల నిర్మూలనలో వరంగల్ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ భేష్
Warangal: పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగం, రవాణా, సాగు, నిల్వ, సరఫరా మరియు అక్రమ విక్రయాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు యువతను మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు వ్యసనాల బారిన పడకుండా రక్షించేందుకు డ్రగ్స్ కంట్రోల్ టీం పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
15-07-2024న “డ్రగ్స్ కంట్రోల్ టీమ్” అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.ఈ బృందం నిరంతర నిఘా, సమాచార సేకరణ, ప్రత్యేక దాడుల ద్వారా గంజాయి సంబంధిత నేరాల్లో పాల్గొనే వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తోంది. అదేవిధంగా మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలపై విద్యార్థులు మరియు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గంజాయి సాగు, రవాణా, నిల్వ, సరఫరా లేదా అక్రమ విక్రయాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని 8712685299, 8712584473 ఫోన్ నంబర్ల ద్వారా పోలీసులకు అందించి ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారదాతల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుతూ, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణమే డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.
డ్రగ్స్ కంట్రోల్ టీమ్ సాధించిన ఫలితాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ టీమ్ 15-07-2024 నుండి 16-06-2026 వరకు చేపట్టిన చర్యల్లో గణనీయమైన ఫలితాలు సాధించింది.
1. అమలు చర్యలు (Enforcement Work)
నమోదైన మొత్తం కేసులు : 192
కేసుల్లో ప్రమేయం ఉన్న మొత్తం వ్యక్తులు : 403 మంది
2. స్వాధీనం చేసుకున్న మాద
కద్రవ్యాలు మరియు ఆస్తులు
గంజాయి : 1,241.110 కిలోగ్రాములు
గంజాయి మొక్కలు : 07
ఓపియం : 1.530 కిలోగ్రాములు
బ్రౌన్ షుగర్ : 0.2 గ్రాములు
హషీష్ ఆయిల్ : 22.4 లీటర్లు
గంజాయి చాక్లెట్లు : 251
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల మొత్తం విలువ : రూ. 8,57,90,978/-
ఇతర స్వాధీనం చేసుకున్న వస్తువులు:
నగదు : రూ. 2,15,500/-
మొబైల్ ఫోన్లు : 601
ద్విచక్ర వాహనాలు : 63
ఆటోలు : 06
కార్లు : 08
3. కౌన్సెలింగ్ చర్యలు
ధూమపాన వ్యసనానికి గురైన 435 మంది వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించబడింది.
4. నిషేధిత మందుల అక్రమ విక్రయాలపై చర్యలు
వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మాత్రలను అక్రమంగా విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడినవి.
5. పట్టణ తనిఖీలు మరియు నిఘా చర్యలు
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విద్యాసంస్థలు వంటి రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడ్డాయి. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 100 గజాల పరిధిలో ఉన్న పాన్ షాపులు మరియు కిరాణా దుకాణాలపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లు చేపట్టి, సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీలు నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ సహాయంతో నిర్వహించబడగా, మాదకద్రవ్యాల నియంత్రణలో మరింత సమర్థవంతమైన ఫలితాలు సాధించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
6. అవగాహన కార్యక్రమాలు మరియు కౌన్సెలింగ్
మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వ్యక్తులు మరియు వారి తల్లిదండ్రులకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ హాస్టళ్లలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు చట్టపరమైన పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
గంజాయి స్మోకర్ కేసులపై ప్రత్యేక అవకాశం
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.4 ప్రకారం, గతంలో గంజాయి వినియోగం (Smoker Case) సంబంధిత కేసులు నమోదైన వ్యక్తులు గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందినట్లయితే, ఆ చికిత్సకు సంబంధించిన సర్టిఫికెట్‌ను సంబంధిత న్యాయస్థానంలోని మేజిస్ట్రేట్ గారికి సమర్పించవచ్చు.
మేజిస్ట్రేట్ గారు ఆ సర్టిఫికెట్‌ను పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుని, అర్హులైన వ్యక్తులపై నమోదైన గంజాయి స్మోకర్ కేసులను కొట్టివేసే అవకాశం కల్పించబడింది.
అందువల్ల గతంలో గంజాయి స్మోకర్ కేసులు నమోదైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందిన అనంతరం సంబంధిత సర్టిఫికెట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని సూచిస్తున్నాము.
సమాచారం అందించేందుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8712685299
8712584473
మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో అవసరం. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




