Warangal: ఖమ్మం సీసీఎస్ సిబ్బందికి ప్రశంసలు

Warangal: ట్రైన్‌లో సినిమా స్టైల్ ఛేజింగ్! కేయూసీ పీఎస్ పరిధిలో చోరీ చేసి పారిపోతున్న పశ్చిమ బెంగాల్ గ్యాంగ్‌ను మధిర వద్ద పట్టుకున్న ఖమ్మం సీసీఎస్ పోలీసులకు సీపీల అభినందనలు.

M RAVIKIRAN
Published on: 4 Jun 2026 6:00 PM IST
Warangal
X

Warangal: ఖమ్మం సీసీఎస్ సిబ్బందికి ప్రశంసలు

వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని KUC పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 669/2025, 670/2025 మరియు 14/2026 (సెక్షన్ 331(3), 305(a) BNS కింద) కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఇతర రాష్ట్ర నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందిని, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

వివరాలలోకి వెళ్ళితే.. ఇటీవల వరంగల్ జిల్లా,KUC పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు చోరీ సొత్తుతో ఖమ్మం మీదుగా వెళ్లే రైల్లో పారిపోతున్నట్లు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా గుర్తించిన వరంగల్ జిల్లా పోలీసులు వెంటనే ఖమ్మం జిల్లా పోలీసులకు సమాచారం అందించారు.

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఖమ్మం జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది ప్రయాణికుల్లాగా ఖమ్మంలో రైలు ఎక్కి ప్రతి రైలు భోగిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ... రైలు మధిరకు వచ్చే సరికి పశ్చిమ బెంగాల్ కు చెందిన Sk. ఫిరోజ్, Sk. ఎమిన్,Sk.సుఖ్ చంద్ అనే ముగ్గురు నిందుతులను గుర్తించి చాకచక్యంగా పట్టుకొని వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించి అందించిన అమూల్యమైన సహకారానికి వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందించిన ప్రశంస పత్రాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా సిబ్బందికి గురువారం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సిసిఎస్ ఏసీపీ సర్వర్ పాల్గొన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story