Warangal: విధుల్లో నిబద్ధత ముఖ్యం.. ఆర్ఎస్ఐ భుజాలపై స్టార్స్ అలంకరించిన వరంగల్ సీపీ!
Warangal: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఏఆర్ఎస్ఐ నుంచి ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందిన ఏ. కుమార స్వామికి స్టార్ల అలంకరణ. విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సీపీ పిలుపు.
Warangal: విధుల్లో నిబద్ధత ముఖ్యం.. ఆర్ఎస్ఐ భుజాలపై స్టార్స్ అలంకరించిన వరంగల్ సీపీ!
వరంగల్: అప్పగించిన విధులను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఏఆర్ఎస్ఐ నుంచి ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందిన ఏ. కుమార స్వామి సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన భుజాలపై పదోన్నతి చిహ్నాన్ని సీపీ అలంకరించారు. విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ, ఉన్నతాధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
Next Story




