Warangal: వరంగల్‌లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి!

Warangal: వరంగల్ వెంకట్రామ జంక్షన్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్.

MD. AMEER, WARANGAL EAST
Published on: 2 Sept 2026 4:41 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి!

Warangal: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్ వెంకట్రామ జంక్షన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజా నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన ప్రజలకు భరోసాను కల్పించడంతో పాటు సంక్షేమానికి కొత్త దిశను చూపించిందని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు.

పేదల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ గారు.. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపిన గొప్ప ప్రజానాయకుడని అన్నారు.

వైఎస్సార్ గారి ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన సంక్షేమ బాటలో ప్రజా పాలన కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అయూబ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కమాలుద్దీన్, మహమూద్ పాషా, కోదాటి అనిల్, కూచన రవీందర్, గిన్నారపు రాజు, SD కుతుజ్, జన్ను ఆదాం, అమృత రావు, బండ్ల సురేందర్, యూత్ నాయకులు నిశాంత్, వినోద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story