Warangal: ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి!
Warangal: తెలంగాణలో అర్హులైన ట్రాన్స్జెండర్లకు నెలకు రూ.10,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పుష్పక్క డిమాండ్ చేశారు.
Warangal: ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి!
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం, వికలాంగుల హక్కులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్జెండర్ల సామాజిక భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. నవంబర్ 19న ఖైరతాబాద్‌లో పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పెన్షన్ కోసం వచ్చిన మహిళతో కాళ్లు మొక్కించుకున్న ఘటన తీవ్రంగా బాధించింది. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి కానీ, వారితో కాళ్లు మొక్కించుకోవడం ఏ విధమైన ప్రజాసేవ?
ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళ కాళ్లు మొక్కాలని చెప్పినట్లు వచ్చిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? ఒక మహిళ పెన్షన్ కోసం వచ్చినప్పుడు ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మహిళల గౌరవం రాజకీయాలకు అతీతంగా ఉండాలి.
ట్రాన్స్జెండర్లకు పెన్షన్ ఎక్కడ?
మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం తెలంగాణలో జీవిస్తున్న ట్రాన్స్జెండర్లను ఎందుకు విస్మరిస్తోంది?
ప్రభుత్వానికి తెలంగాణలో అర్హులైన ట్రాన్స్‌జెండర్లందరికీ నెలవారీ గౌరవ పెన్షన్ ఎప్పుడు ప్రకటిస్తారు?, ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారు?, ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవంగా జీవించే హక్కు లేదా? ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలు చేస్తారు?
ట్రాన్స్జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యసభలో ట్రాన్స్జెండర్లకు రెండు స్థానాల ప్రాతినిధ్యం కల్పించే అంశంపై బిల్లు లేదా ప్రతిపాదన తీసుకొచ్చినట్లయితే, దాని అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అయితే అంతకంటే ముందు రాష్ట్రంలోనే ట్రాన్స్జెండర్లకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలి.
నా ప్రధాన డిమాండ్ ఏమిటంటే:
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఒక అర్హత కలిగిన ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం కల్పించేలా ప్రభుత్వం పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ట్రాన్స్జెండర్లను వెంటనే నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
రాజకీయ నిర్ణయాల్లో ట్రాన్స్జెండర్లకు భాగస్వామ్యం కల్పించాలి. మాకు కేవలం హామీలు కాదు, అధికారంలో భాగస్వామ్యం కావాలి. ప్రేమ పేరుతో మోసాలు – ట్రాన్స్జెండర్ల ప్రాణాలకు రక్షణ ఎక్కడ?
ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ట్రాన్స్జెండర్ల జీవితాలతో ఆడుకోవడం, శారీరకంగా, మానసికంగా వేధించడం, మోసం చేయడం, చివరకు హత్యలు లేదా ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు ఏర్పడటం అత్యంత బాధాకరం.
ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలి. నిందితులపై ఆధారాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్జెండర్లపై జరిగే దాడులు, లైంగిక వేధింపులు, హత్యలు, ప్రేమ పేరుతో మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రత్యేక చట్టాలు – ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి!
ట్రాన్స్జెండర్లపై జరిగే నేరాలను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
అలాగే:
ట్రాన్స్జెండర్లపై జరిగే హింస, వేధింపులు, బెదిరింపులు, దాడుల నివారణకు ప్రస్తుత చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. అవసరమైన చోట ప్రత్యేక చట్టపరమైన రక్షణ నిబంధనలు తీసుకురావాలి. బాధితులకు ఉచిత న్యాయ సహాయం, రక్షణ, వైద్య సహాయం, ఆర్థిక సహాయం అందించాలి. ప్రతి కేసులో త్వరితగతిన దర్యాప్తు, న్యాయ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వానికి మా ప్రధాన డిమాండ్లు
అర్హులైన ట్రాన్స్జెండర్లకు నెలవారీ గౌరవ పెన్షన్ ప్రకటించాలి. ప్రత్యేక సంక్షేమ బోర్డును బలోపేతం చేయాలి. విద్య, ఉద్యోగాలు, వైద్యం, నివాస సౌకర్యాలు కల్పించాలి. రాజకీయంగా, నామినేటెడ్ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. వరంగల్ మేయర్ పదవికి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిని పరిశీలించాలి. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి.
ట్రాన్స్జెండర్లపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి.. ట్రాన్స్జెండర్లకు నెలకు రూ.10.000 పింఛన్ ఇవ్వాలి – ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పుష్పితలయ వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ సూటి ప్రశ్నలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్నలు!
మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని పేదలు, మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు, గీత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదు?
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది గీత కార్మికులు వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో రూ.6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తుంది? మీ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల మూడు నెలల పింఛను మీరే తీసుకున్నారు .....మిగతా హామీలను ఎందుకు విస్మరించింది?
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల 500 ఉన్న పింఛన్‌ను పెంచి రూ.4,016 అందించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలి.
ప్రభుత్వ భూములను అమ్ముతూ, వందల కోట్ల విలువైన భూముల కేటాయింపులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ ప్రభుత్వానికి పేదలకు సంక్షేమం అందించడానికి మాత్రం డబ్బులు లేవా?
మరి మేము ట్రాన్స్జెండర్లం మీకు కనిపించడం లేదా రేవంత్ రెడ్డి గారు?
ట్రాన్స్జెండర్లు ఈ సమాజంలో భాగం కాదా? మాకు జీవించే హక్కు లేదా? మాకు ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? ఉద్యోగ అవకాశాలు లేకుండా, కుటుంబాల ఆదరణ లేకుండా, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ జీవిస్తున్న ట్రాన్స్జెండర్లకు నెలకు కనీసం రూ. 10000 పింఛన్ ఇవ్వడానికి మీ ప్రభుత్వానికి మనసు రావడం లేదా?
మీరు తరచూ మీ గురువు అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నప్పుడు, తెలంగాణలో మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? తెలంగాణలో కూడా దివ్యాంగులకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించాలి.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు కూడా పింఛన్ సదుపాయం కల్పిస్తున్నప్పుడు, తెలంగాణలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?
మంత్రి సీతక్క గారికి నా ప్రశ్నలు:
ఇటీవల అసెంబ్లీలో కొత్త పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, కొత్త పథకాల గురించి మాట్లాడారు. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదని మీరు ప్రస్తావించారు. సదరం సర్టిఫికెట్లు లేని వారి సమస్యలను కూడా వివరించారు.
మరి ఎన్నికల సమయంలో రూ.4,000 పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలి.
ట్రాన్స్జెండర్ల సంక్షేమం గురించి మీ ప్రభుత్వం ఎప్పుడు చర్చిస్తుంది? మా సమస్యలను అసెంబ్లీలో ఎప్పుడు ప్రస్తావిస్తారు?
మా ప్రధాన డిమాండ్లు:
తెలంగాణలో అర్హులైన ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు నెలకు రూ. 10000 పింఛన్ ఇవ్వాలి. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. నిజమైన అర్హులను గుర్తించి పారదర్శకంగా పింఛన్లు అందించాలి.
ట్రాన్స్జెండర్లకు విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి కల్పించాలి. వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు, గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
ప్రత్యేకంగా ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ట్రాన్స్జెండర్లకు ఇచ్చే పింఛన్‌ను అర్హులైన ట్రాన్స్జెండర్లకు మాత్రమే కేటాయించాలి. వారి గుర్తింపు, అర్హతలను పరిశీలించి ఎలాంటి దుర్వినియోగం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలి.
రేవంత్ రెడ్డి గారు.. మాకు రాజకీయ హామీలు వద్దు, ఆచరణలో సంక్షేమం కావాలి. మాకు జాలి చూపించాల్సిన అవసరం లేదు. మా హక్కులను గుర్తించి గౌరవించాలి. ట్రాన్స్జెండర్లు కూడా ఈ ఇండియన్ పీపుల్స్ మాకు సమాన హక్కులు, సామాజిక భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
మా గొంతును అసెంబ్లీలో వినిపించాలి. మా సమస్యలకు పరిష్కారం చూపాలి. ట్రాన్స్జెండర్లకు నెలకు రూ. 10000 పింఛన్ ప్రకటించే వరకు మా పోరాటం ఆగదు. ఇట్లు, పుష్పక్క వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం.




