Warangal: మండి బజార్ బిర్యానీ పాయింట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడి

Warangal: వరంగల్ మండి బజార్‌లోని హోటళ్లు, బిర్యానీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. నిషేధిత రసాయన రంగులు ధ్వంసం, శాంపిల్స్ ల్యాబ్‌కు తరలింపు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 10 Nov 2026 10:09 PM IST
Warangal
X

Warangal: మండి బజార్ బిర్యానీ పాయింట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడి

వరంగల్: వరంగల్ నగరంలోని మండి బజార్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ మౌనిక నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం మండి బజార్‌లోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై మెరుపు దాడులు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో భాగంగా ఖుర్షిద్ హోటల్, జాఫ్రాన్ హోటల్, తయబ్ హోటల్ మరియు కోహినూర్, గ్రీన్ పార్క్ బిర్యానీ సెంటర్లలో పరిశీలన జరిపారు. తనిఖీల సమయంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తయారు చేసే నిర్వాహకులకు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం, హెడ్ క్యాప్స్, గ్లౌజులు, ఏప్రాన్లు ధరించకపోవడాన్ని అధికారులు గమనించారు.

బిర్యానీ మరియు చికెన్ ఐటమ్స్‌లలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించి, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే కల్తీ నూనె మరియు ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు తరలించారు.

ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని, నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST