Warangal: మైలారం సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Warangal: రాయపర్తి మండలం మైలారంలో సాయి నామస్మరణతో మారుమోగిన ఆలయం. గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, వైభవంగా పల్లకీ సేవ, మహా అన్నదానం.

P ASHOK, WARDHANNAPET
Published on: 29 July 2026 3:57 PM IST
Warangal
X

Warangal: మైలారం సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

వరంగల్: గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ని సాయిబాబా ఆలయం సాయి నామస్మరణతో మారు మోగింది బాబా భక్తులు గురుపౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే బాబాకి కాకడ హారతి తో మొదలై, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, వంటి ప్రత్యేక పూజలు మరియు దివ్య అలంకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం భక్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహించి బాబా పల్లకి సేవలో పాల్గొని ఊరంతా పల్లకి సేవ చేశారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించరు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET

Next Story