Warangal: ఉర్సు రంగలీల మైదానంలో వైభవంగా నరకాసుర వధ వేడుకలు
Warangal: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో వైభవంగా నరకాసుర వధ. రిమోట్ ద్వారా నరకాసురుని ప్రతిమ దహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండా సురేఖ, గుండు సుధారాణి.
Warangal: ఉర్సు రంగలీల మైదానంలో వైభవంగా నరకాసుర వధ వేడుకలు
వరంగల్: ఉర్సులోని రంగలీల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నరకాసుర వధ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ, కుడా చైర్‌పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి ప్రజాప్రతినిధులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి రిమోట్ ద్వారా నరకాసురుని వధ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరకాసురుని భారీ ప్రతిమ దహనంతో మైదానం సందడిగా మారింది.
నరకాసుర వధ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ వేడుకలు ప్రజల్లో ధర్మం, సత్యం, విజయానికి సంబంధించిన స్ఫూర్తిని నింపుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల ఉత్సాహం, సందడి మధ్య నరకాసుర వధ వేడుకలు ఘనంగా ముగిశాయి.




