Warangal: తాగునీటి నాణ్యతపై జీడబ్ల్యుఎంసి కమిషనర్ సమీక్ష

Warangal: వరంగల్ నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించే చర్యలపై జీడబ్ల్యుఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 31 Aug 2026 9:10 PM IST
Warangal
X

Warangal: తాగునీటి నాణ్యతపై జీడబ్ల్యుఎంసి కమిషనర్ సమీక్ష

వరంగల్: నగర ప్రజలకు మరింత నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న సోమవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో NIT మాజీ ప్రొఫెసర్ పాండురంగారావుతో కలిసి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలో నీటి సరఫరా, నీటి స్వచ్ఛత, నాణ్యత, పరిమాణం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం వంటి అంశాలపై ప్రొఫెసర్ పాండురంగారావు పలు సూచనలు చేశారు.

ప్రజలకు మంచి నాణ్యతతో, పూర్తి స్వచ్ఛతతో, అవసరమైన పరిమాణంలో తాగునీటిని అందించేందుకు ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రవికుమార్, సంతోష్ బాబు, సంజయ్ కుమార్, మాధవి, డీ ఈలు రోజా రాణి, హరి తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story