Warangal: మోటూరి కృష్ణ ప్రసాద్ సంస్మరణ సభకు ఎమ్మెల్యే నాయినికి ఆహ్వానం
Warangal: వరంగల్‌లో అక్టోబర్ 3న మోటూరి కృష్ణ ప్రసాద్ సంస్మరణ సభ. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన ఇనామ్ ప్రతినిధులు.
Warangal: మోటూరి కృష్ణ ప్రసాద్ సంస్మరణ సభకు ఎమ్మెల్యే నాయినికి ఆహ్వానం
వరంగల్: ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్(ఇనామ్)అధ్యక్షుడు మోటూరి కృష్ణ ప్రసాద్ సంస్మరణ సభను అక్టోబర్ 3న నిర్వహించనున్న నేపథ్యంలో..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఇనామ్ ప్రతినిధులు ఆహ్వానించారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే అధికారిక నివాసానికి వెళ్లిన ఇనామ్ ప్రతినిధులు సభకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేసి,కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు.మోటూరి కృష్ణ ప్రసాద్ సేవలను స్మరించుకుంటూ నిర్వహించనున్న సంస్మరణ సభకు ఎమ్మెల్యే ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఓం బ్రహ్మం,బాలరాజు,రామబ్రహ్మం,అయూబ్ మహమ్మద్,నూనా అప్పారావు,అఫ్జల్ మొహియుద్దీన్,డాక్టర్ రాజ్ మహమ్మద్,అబూబకర్(అడ్వకేట్)కాజీపేట మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.




