Warangal: జమియత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో ప్రెస్‌కాన్ఫరెన్స్
Warangal: వరంగల్‌లో జమియత్ ఉలమా హింద్ ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మత సామరస్యం, విద్యా చైతన్యానికి కృషి చేస్తున్నట్లు నేతలు తెలిపారు.
Warangal: జమియత్ ఉలమా హింద్ ఆధ్వర్యంలో ప్రెస్‌కాన్ఫరెన్స్
వరంగల్: జమియత్ ఉలమా హింద్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.కార్యక్రమానికి జమియత్ ఉలమా హింద్ కేంద్ర జనరల్ సెక్రటరీ మౌలానా ముఫ్తీ ముహమ్మద్ మాసూమ్ సాఖిబ్ ఖాస్మీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశవ్యాప్తంగా జమియత్ ఉలమా హింద్ మిల్లత్ సంక్షేమం,విద్యా చైతన్యం,సామాజిక సమస్యల పరిష్కారం,మత సామరస్యానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.దేశ స్వాతంత్ర్యం నుంచి నేటి వరకు జమియత్ ప్రజా సంక్షేమం,మానవ సేవలో ముందుంటోందన్నారు.
తెలంగాణతో పాటు వరంగల్‌లో దైనిక,విద్యా,సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు మాసూమ్ సాఖిబ్ ఖాస్మీ వెల్లడించారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జమియత్ ఉలమా హింద్ వరంగల్ జిల్లా కార్యదర్శి మౌలానా మునవ్వర్ సాహెబ్,జమియత్ ఉలమా తెలంగాణ జనరల్ సెక్రటరీ మౌలానా ముహమ్మద్ జుబైర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.




