Warangal: కేటీఆర్ సభను విజయవంతం చేయాలి నన్నపునేని నరేందర్

Warangal: ఈ నెల 22న హన్మకొండలో నిర్వహించనున్న కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 17 Nov 2026 11:07 PM IST
Warangal
X

Warangal: కేటీఆర్ సభను విజయవంతం చేయాలి నన్నపునేని నరేందర్

వరంగల్: ఈ నెల 22వ తేదీన హన్మకొండ లో నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా, వారికి ఘన స్వాగతం పలికేందుకు వారి నివాసంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ మరియు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డివిజన్‌ల వారీగా సభకు హాజరయ్యే కార్యకర్తలు, నాయకుల వివరాలను సేకరించి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా సమన్వయం చేసుకోవాలని సూచించడం జరిగింది. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు వరంగల్ లోని వాల్ మార్ట్ ప్రదేశంలో నన్నపునేని మెహర్ వాణి -నరేందర్ కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నందున, ఈ కార్యక్రమానికి కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని నాయకులు, కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది.

కేటీఆర్ సభను విజయవంతం చేయడం – వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జిలు మాజీ డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST