Warangal: ఎంజీఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల సహాయకులు, నిరుపేదల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 17 Nov 2026 10:47 PM IST
Warangal
X

Warangal: ఎంజీఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

వరంగల్: సేవా కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అధ్యక్షుడు లయన్ సింగారం శ్రీకర్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు, నిరుపేదలకు భోజనం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ లయన్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం అత్యంత గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, సేవాభావం, పరస్పర సహకార స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన దాత మెంతుల సిరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ ఆడెపు రవీందర్, లయన్ లకుం ఐలయ్య, లయన్ హఫీజ్, లయన్ చంద్రశేఖర్ తదితరులు, MGM ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST