Warangal: యువజన సంఘం నిధులపై మెరుగు అశోక్ సవాల్

Warangal: వరంగల్ శివనగర్ యువజన సంఘంలో కోటి రూపాయల నిధుల గోల్మల్ జరిగిందని, నిరూపిస్తే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మెరుగు అశోక్ సవాల్ విసిరారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 19 Nov 2026 10:58 PM IST
Warangal
X

Warangal: యువజన సంఘం నిధులపై మెరుగు అశోక్ సవాల్

వరంగల్: వరంగల్ శివ నగర్ ప్రాంతంలోని యువజన సంఘంలో 100% శాతం నిధుల దుర్వినియోగం జరిగిందని మెరుగు అశోక్ అన్నారు,సంఘంలో నిధులు గోల్మల్ జరిగింది అంటూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషనలో సంఘం సభ్యులు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ధనం దుర్వినియోగం జరిగిందని,వారు ఇచ్చిన దాంట్లోనే తప్పు లెక్కలు కనిపిస్తున్నాయని,దాదాపు కోటి రూపాయల వరకు గోల్మల్ జరిగింది అన్నారు.

కార్యవర్గ సభ్యులు జీతాలు తీసుకున్నప్పటికీపెండింగ్ బిల్లుల వసూలుకు తిరిగిన ఖర్షు 29400/- ఐతే వారు వాసులు చేసిన ఆలస్య రుసుము 2824/-,నెలకు సాదర కర్షులు 4000 రూపాయలు, తిరగడానికి వేల రూపాయలు వాడుకున్నారు అన్నారు, అనవసర ఖర్చులు పెడుతూ,బినామీల పేరు మీద సంఘం పైసలు ఎత్తుకుని కట్టడం లేదు అన్నారు,వెంటనే ఆడిటర్ మరియు పోలీస్ వారి సమక్షంలో లెక్కలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST