Warangal: ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధిని విస్మరించారు: బీఎస్పీ ఫైర్
Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి గాయపడ్డ బాధితులను బీఎస్పీ నేతలు పరామర్శించి, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Warangal: ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధిని విస్మరించారు: బీఎస్పీ ఫైర్
Warangal: వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వనం మహేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో పై పెచ్చులు ఊడిన సంఘటనలో గాయపడ్డ వారిని బి.ఎస్.పి నేతలు పరామర్శించారు. ప్రమాదం జరిగిన వార్డును, ఆసుపత్రి పరిసరాలను నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రమాదం జరిగిన వార్డును సందర్శించిన ఉన్నతాధికారులు గాయపడ్డ వారిని పరామర్శించడం విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రిని సందర్శించిన వారిలో బీఎస్పీ నేతలు అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఉపేందర్, మనోహర్, తదితరులు ఉన్నారు.




