Warangal: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొండా సురేఖ
Warangal: వరంగల్ తూర్పు 33వ డివిజన్‌లో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ పరామర్శించి, ఆర్థిక సహాయం, డబల్ బెడ్ రూమ్ హామీ ఇచ్చారు.
Warangal: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొండా సురేఖ
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33వ డివిజన్‌కు చెందిన న్యాలపోగుల సంజయ్‌కుమార్ (60) ఆయన భార్య శోభ (55) దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి, వారి కష్టసమయంలో అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని మరియు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు, గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెరశాల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మరాజుల సందీప్, బొమ్మగాని శ్రీనివాస్, దయా సింగ్, రేవంత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.




