Warangal: వేయి స్తంభాల గుడిలో కార్తీక మాసోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని!

Warangal: వేయి స్తంభాల గుడిలో వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు. జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు ప్రారంభించిన హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 1:46 PM IST
Warangal
X

Warangal: వేయి స్తంభాల గుడిలో కార్తీక మాసోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని!

Warangal: చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయం నందు ఈరోజు కార్తీక శుద్ధ మంగళవారం10/11/2026 నుండి 8/11/2026 మంగళవారం వరకు జరిగే కార్తీక మాస ఉత్సవములు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి బ్రాహ్మీ ముహూర్తంలో మంగళకరమైన మంగళ వాయిద్యాల మధ్య ఉత్తిష్ఠ గణపతి ఆరాధనతో ప్రారంభమైనాయి. రుద్రేశ్వర స్వామి కి 11 లీటర్ల ఆవుపాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించి సామూహిక రుద్ర అభిషేకాలు నిర్వర్తించడం జరిగినది.

ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించుకునీ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి వెంట మాజీ కార్పొరేటర్లు పుప్పాల ప్రభాకర్, నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, బోడ డిన్న తదితరులు ఉన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్ కుమార్ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆలయనాట్య మండపంలో ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు శేష వస్త్రాలు అందించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం అంటే భక్తులలో భక్తి చైతన్యం కలిగించే మాసమని ముఖ్యంగా మహిళలు సామూహికంగా కులాలకు అతీతంగా మహిళలంతా కూడా దీపాలు వెలిగించుకోవడం ఈనెల ప్రత్యేకత అని ఇంత పురాతనమైన ఆలయంలో పరమశివుని పూజించడం ఎంతో అనుభూతి ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జయేంద్రపురి మహాస్వామి బెంగుళూరు వారు తమ శిష్య బృందంతో వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉపన్యాసిస్తూ భగవంతునిపై మనస్ఫూర్తిగా లగ్నమయ్యే కాలం కూడా కార్తీకమే ధ్యానం,ధ్యేయం,ధ్యాత అనే మాటలు మూడు ఉన్నాయి. మనం దైవాన్ని ధ్యానం చేసుకునే అభిలాషతో దైవం ముందు కూర్చోగానే ఆ ధ్యానగాడత ద్వారా ధ్యానం వైపు దృష్టి తగ్గుతుంది.

అప్పడికే రెండు మిగులుతాయి. మరికొంత కాలం ఇలా సాగించుకుంటూ వెళ్తే ధ్యేయం కూడా తొలగిపోయి ధ్యాత అనగా ధ్యానించేవాడు మాత్రమే మిగులుతాడు. అదే అద్వైత సిద్ధికి ఆరంభమని వేదాంతం చెబుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కార్తీకమాసంలో శివారాధన ఉపవాసమనే ప్రాధాన్యం ఇవ్వాలి ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయడం సర్వ శ్రేష్టం. ప్రత్యేకించి సాయం సంధ్యలో ఆకాశదీపం పెట్టాలి ఉసిరికాయ మీద ఒత్తి పెట్టి దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. కార్తిక మాసం నెల రోజులూ చేయదగిన కొన్ని ప్రత్యేక కృత్యాలు స్కంద పురాణం ప్రత్యేకంగా వివరిస్తుంది. ఇతర శాస్త్ర గ్రంధాలు కూడా కార్తీకంలో చేయదగిన ముఖ్యమైన పూజా విధానాలను వివరిస్తున్నాయి వీటిలో ముఖ్యమైనవి స్నానం,ఉపవాసం, దానం, దీపం. అని ఉపన్యాసించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్