Warangal: ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య
Warangal: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆకాంక్ష.
Warangal: ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య
వరంగల్: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని ఎంపీ పేర్కొన్నారు.
తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాల సిరులు కురిపించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, తెలంగాణ సంస్కృతి వైభవం కలకాలం పరిఢవిల్లాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.




