Hanamkonda: వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీ కడియం కావ్య విజయదశమి శుభాకాంక్షలు!

Hanamkonda: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 20 Oct 2026 6:46 AM IST
Hanamkonda
X

Hanamkonda: వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీ కడియం కావ్య విజయదశమి శుభాకాంక్షలు!

Hanamkonda: విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల్లో నూతన ఆశలు, సానుకూల ఆలోచనలు, విజయస్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు.

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే దసరా పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని విజయాలు సాధించాలని కోరారు.

చెడు ఎంత బలంగా కనిపించినా.. చివరికి గెలిచేది మంచితనమే అని విజయదశమి చాటిచెబుతుందని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. పాలపిట్ట దర్శనం శుభసూచకంగా భావించే ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

కులమతాలకు అతీతంగా సోదరభావం, పరస్పర గౌరవం, ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని, ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని, ప్రజల ఆశయాలు నెరవేరాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలకు, శుభపరిణామాలకు నాంది కావాలని ఈ సందర్భంగా మరోసారి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.