Warangal: వరంగల్ కొత్త సీపీ శ్వేత.. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Warangal: వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారుల పూర్ణకుంభ స్వాగతం. శాంతిభద్రతలపై సీపీ కీలక వ్యాఖ్యలు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 1 July 2026 2:36 PM IST
Warangal
X

Warangal: వరంగల్ కొత్త సీపీ శ్వేత.. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

వరంగల్: నూతన పోలీస్ కమిషనర్ (సీపీ) శ్వేత చారిత్రాత్మక భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, అనంతరం శ్వేత కి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో వరంగల్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా సీపీ పేర్కొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story