Warangal: ఐఎంఏ వరంగల్ నూతన కార్యవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

Warangal: వరంగల్ ఐఎంఏ 2026–27 కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్, కార్యదర్శిగా డా. వి. నరేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి టీమ్ సంకల్ప్ లక్ష్యాలు తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 19 Nov 2026 11:02 PM IST
Warangal
X

Warangal: ఐఎంఏ వరంగల్ నూతన కార్యవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం

వరంగల్: 2026–27 సంవత్సరానికి అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్ – కార్యదర్శిగా డా. వి. నరేష్ కుమార్, ఆర్ధిక కార్యదర్శి గా డా ముప్పిడి దిలీప్ కుమార్, ప్రెసిడెంట్ ఎలెక్ట్:డా టి.సనత్ కుమార్, బాధ్యతల స్వీకరణ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వరంగల్ శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వరంగల్ ఐఎంఏ కార్యాలయంలోని డా. కె.ఎస్.ఆర్. శాస్త్రి – డా. ఝాన్సీ దేవి ఐఎంఏ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. వి. విజయ్ కుమార్, గౌరవ అతిధులుగా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, డా. పి. కిషన్, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికైన డా. సంజీవ్ సింగ్ యాదవ్, తదుపరి అధ్యక్ష ఎన్నికైన డా. సి.హెచ్. జగన్ మోహన్ రావు, ఐఎంఏ జాతీయ కార్యవర్గ యాక్షన్ కమిటీ చైర్మన్ డా. ఇ. రవీందర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యాలయ ఆఓ గావో చలేన్ చైర్మన్.

డా. పి. కాళీప్రసాద్ రావు, హనుమకొండ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డా. పి. విజయ్ చంద్ర రెడ్డి, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా. టి.వి. శ్రీనివాస్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డా. జె. విజయ రావు, ఐఎంఏ తెలంగాణ జోన్-III వైస్ ప్రెసిడెంట్ డా. పి. సుధీర్ కుమార్, జోన్-III జాయింట్ సెక్రటరీ డా. బి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం – 2026–27

* అధ్యక్షులు: డా. పి. ప్రవీణ్

* అధ్యక్ష ఎన్నికైన వారు (2027–28): డా. టి. సనత్ కుమార్

* ఉపాధ్యక్షులు:

* ⁠డా మానస నరహరి,

* ⁠డా. జి. రాజేశ్వర్ రెడ్డి,

* ⁠డా. బి. నరేష్,

* ⁠డా. తెలుగు రామకృష్ణ

* ప్రధాన కార్యదర్శి:

* ⁠డా. వి. నరేష్ కుమార్

* సంయుక్త కార్యదర్శులు:

* ⁠డా. జె. కావ్య రావు,

* ⁠డా. బండి సంతోష్ కుమార్,

* ⁠డా. శివ సృజన్,

* ⁠డా. బి. పూర్ణ చంద్ర

* ఆర్థిక కార్యదర్శి:

* ⁠డా. ముప్పిడి దిలీప్ కుమార్

TEAM SANKALP –

అధ్యక్షుని దార్శనికత ఈ సంవత్సరానికి నూతన కార్యవర్గం TEAM SANKALP పేరుతో ఐకమత్యం, సేవ, వృత్తిపరమైన నిబద్ధత అనే లక్ష్యాలతో ముందుకు సాగనుంది. అధ్యక్షులు డా. పి. ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో తమ టీం పేరు సంకల్ప్ గా ప్రకటించారు. అలాగే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

టీమ్ సంకల్ప్ ప్రధాన లక్ష్యాలు:

1. ప్రజారోగ్య పరిరక్షణ:

ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం.

1. నకిలీ వైద్యానికి అడ్డుకట్ట:

క్వాకరీ నిర్మూలనకు కృషి చేస్తూ, అనధికార వైద్య విధానాలపై చట్టబద్ధమైన చర్యలకు సహకరించడం, అర్హత కలిగిన వైద్యుల గౌరవాన్ని కాపాడడం.

3.వైద్యుల భద్రత మరియు గౌరవం:

వైద్యులపై దాడులను అరికట్టేందుకు పోలీస్ శాఖతో సమన్వయం, అత్యవసర సమయాల్లో వేగవంతమైన స్పందన, ఆసుపత్రుల భద్రతకు ప్రాధాన్యత.

4.వైద్యుల ఆరోగ్యం – Fitness for Every Doctor:

వైద్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్, యోగా, ఆరోగ్య పరీక్షలు, వెల్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించడం.

5.సభ్యుల సంక్షేమం:

ఐఎంఏ సభ్యులు మరియు వారి కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యాలు, సంక్షేమ పథకాలు కల్పించే అవకాశాలను పరిశీలించడం.

6.ఐకమత్యం మరియు సభ్యత్వ అభివృద్ధి:

సీనియర్ వైద్యులు, యువ వైద్యుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మహిళా వైద్యుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఐఎంఏ సభ్యత్వాన్ని బలోపేతం చేయడం.

7.స్వాస్థ్య – The Life Space of IMA:

గత కార్యవర్గం ప్రారంభించిన స్వాస్థ్య ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లి, ఐఎంఏ భూమిని వైద్యుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఉపయోగపడే సమగ్ర వెల్‌నెస్ కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

ఐకమత్యంతో ముందుకు సాగుతాం

గత అధ్యక్షులు డా. పి. మన్మోహన్ రాజు నాయకత్వంలోని TEAM VIBRANT చేసిన సేవలను, సంస్థ అభివృద్ధికి అందించిన కృషిని నూతన కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు డా. పి. ప్రవీణ్ మాట్లాడుతూ, సీనియర్ వైద్యుల అనుభవం, యువ వైద్యుల ఉత్సాహం, సభ్యులందరి సహకారంతో ఐఎంఏ వరంగల్ శాఖను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి

డా. వి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, సభ్యుల సమస్యల పరిష్కారం, వైద్యుల హక్కులు, వైద్య వృత్తి గౌరవ పరిరక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణకు కార్యవర్గ సభ్యులందరితో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రతి సభ్యుడి సూచనకు ప్రాధాన్యతనిస్తూ ఐఎంఏను మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ఐఎంఏ నాయకులు, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, వైద్య ప్రముఖులు, ఐఎంఏ సభ్యులు, వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST