Warangal: వరంగల్‌లో అమరవీరుల సంస్మరణ రక్తదాన శిబిరం!

Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణార్థం రెడ్‌క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ ఎన్. శ్వేత స్వయంగా రక్తదానం చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 27 Oct 2026 5:35 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో అమరవీరుల సంస్మరణ రక్తదాన శిబిరం!

వరంగల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో భీమారం శుభం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిభిరంలో 101 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ స్వయంగా రక్తదానం చేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీలు సురేష్, వి. శ్రీనివాస్, ఏసీపీలు మధుసూదన్, నరసింహారావు, సత్యనారాయణ, ఏఆర్ ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి.శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ జిల్లా పాలక మండలి సభ్యులు కె.రాకేష్ రావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.