Warangal: మిల్స్ కాలనీలో ఆపరేషన్ చెబుత్రా: 28 మందిపై కేసులు!
Warangal: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో చేపట్టిన 'ఆపరేషన్ చెబుత్రా'లో బహిరంగ మద్యపానం, న్యూసెన్స్‌కు పాల్పడిన 28 మందిపై కేసులు నమోదు చేసి, 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Warangal: మిల్స్ కాలనీలో ఆపరేషన్ చెబుత్రా: 28 మందిపై కేసులు!
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ యన్.శ్వత ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో “ఆపరేషన్ చెబుత్రా” నిర్వహించి 10 బైక్ లు స్వాధీనం చేసుకొని, 28 మందిని అదుపులోకి తీసుకొని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మిల్స్ కాలనీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించడం, న్యూసెన్స్ సృష్టించడం వంటి కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో నిర్వహించే “ఆపరేషన్ చెబుత్రా” కార్యక్రమాన్ని తేదీ 11-10-2026 నాడు రాత్రి అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, వరంగల్ పరిధిలో నిర్వహించడం జరిగింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా చింతల్, అబ్బనికుంట, లేబర్ కాలనీ, ఫోర్ట్ వరంగల్, శివనగర్, ఎస్.ఆర్.ఆర్. తోట, ఉర్సు గుట్ట, కరీమాబాద్, ఉర్సు, శంభునిపేట, రంగశాయిపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న 28 మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అందులో
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దొరికిన 15 మందిపైన CP Act Section 70(A) కింద కేసులు నమోదు చేశారు. మరో 13 మందిపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడినందుకు CP Act Sections 21, 70, 76 కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 10 మోటార్ సైకిళ్లు, 24 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదేవిదంగా అదుపులోకి తీసుకున్న 28 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ కూడా నిర్వహించి అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, న్యూసెన్స్‌కు పాల్పడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వారికి వివరించారు.
"ఆపరేషన్ చెబుత్ర" ఒక నిరంతర ప్రక్రియ అని, ఇకనుండి ఈ కార్యక్రమం ప్రతిరోజూ కొనసాగుతుందని, ప్రజలు రాత్రి వేళలో అవసరమైతే తప్ప బయట తిరుగవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విదంగా ఎవరయినా ప్రవర్తించినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఈ సందర్బంగా హెచ్చరించారు
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తో పాటు ఇతర సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మంగిలాల్, s.శ్రీనివాస్, ఐ శ్రీనివాస్, శ్యాంసుందర్, పలువురు ఎస్సై లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, త్వరిత స్పందన బృందం ఇతర పోలీసు సిబ్బంది మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




