Warangal: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన రెడ్ క్రాస్ చైర్మన్

Warangal: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి, సంస్థకు భూమి, నిధులు కేటాయించాలని కోరారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 15 Nov 2026 8:30 PM IST
Warangal
X

Warangal: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన రెడ్ క్రాస్ చైర్మన్

వరంగల్: వరంగల్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బేతి అశోక్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి, వరంగల్ జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పే చేనేత వస్త్రాలతో రూపొందించిన కార్పెట్ మరియు టవల్‌ను, షీల్డ్ అందజేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం వరంగల్ జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయడానికి సంస్థకు అవసరమైన స్థలాన్ని (ల్యాండ్) మరియు తగిన నిధులను కేటాయించాలని గవర్నర్ గారిని బేతి అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు.

రక్త నిధి సేకరణలో భాగంగా గ్రామాలలో, మండలాలలో వార్డు సభ్యులను, సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను సంవత్సరంలో ఒకసారి రక్త నిధి సేకరణలో భాగస్వామ్యం చేయాలని గవర్నర్ గారిని కోరారు.

దీనివల్ల జిల్లాలో పేదలకు, నిరుపేదలకు, బాధితులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని బేతి అశోక్ బాబు పేర్కొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST