RTC Strike: ముత్తోజిపేటలో రణరంగం: పోలీసు వాహనం ధ్వంసం.. ఆర్టీసీ కార్మికుల ఉగ్రరూపం!

RTC Strike: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారింది. శంకర్‌గౌడ్ మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 April 2026 11:17 AM IST
RTC Strike
X

RTC Strike: ముత్తోజిపేటలో రణరంగం: పోలీసు వాహనం ధ్వంసం.. ఆర్టీసీ కార్మికుల ఉగ్రరూపం!

RTC Strike: వరంగల్‌ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని పట్టు బడుతున్నారు. అయితే.. మృతదేహం తరలింపునకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరగగా.. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు.

శంకర్‌గౌడ్‌ది ప్రభుత్వ హత్యేనంటూ కాంగ్రెస్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు్న్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ముత్తోజిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story