Warangal: భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
Warangal: వరంగల్ భద్రకాళీ అమ్మవారిని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Warangal: భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
వరంగల్: మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమును ఈ రోజు ఉదయం తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం, ఐ.ఏ.ఎస్ కుటుంబ సమేతంగా సందర్శించారు.
ఆలయానికి విచ్చేసిన శ్రీ బుర్రా వెంకటేశం గారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహామండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
అనంతరం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రాంరెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో దేవాలయమునకు భక్తులు పోటెత్తారు.




