Warangal: వరంగల్ మైనారిటీ కోఆర్డినేటర్‌గా ఓరెం వంశీ రాజ్ నియామకం!

Warangal: వరంగల్ పశ్చిమ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా ఓరెం వంశీ రాజ్ నియామకం.

AJAY, HANMAKONDA
Published on: 16 Jun 2026 10:00 AM IST
Warangal
X

Warangal: వరంగల్ మైనారిటీ కోఆర్డినేటర్‌గా ఓరెం వంశీ రాజ్ నియామకం!

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా నియమితులైన ఓరెం వంశీ రాజ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఓరెం వంశీ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అంకితభావంతో పనిచేస్తానని, నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story