Hanumakonda: వైద్య విద్యార్థుల కలలను చిదిమేసిన కేంద్రం నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం

Hanumakonda: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు.

NARENDER, WARANGAL
Published on: 15 May 2026 3:18 PM IST
Hanumakonda
X

Hanumakonda: వైద్య విద్యార్థుల కలలను చిదిమేసిన కేంద్రం నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం

హనుమకొండ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) లో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ పై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. “భారత మాత వారసులం, భారత మాత ముద్దు బిడ్డలం” అని చెప్పుకునే బీజేపీ పాలనలోనే దేశవ్యాప్తంగా NEET పరీక్ష పేపర్ లీకేజ్ జరిగిందని దానిని ఖందించారు. NEET లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడారని.

వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వరుసగా పరీక్షా పత్రాల లీకేజీలు వెలుగుచూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో అనేక పోటీ పరీక్షలు జరిగినప్పటికీ, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగలేదని అన్నారు. రైల్వే, LIC, BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story