Wardhannapet: పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు!

Wardhannapet: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రూ.34.03 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎల్ నినో ప్రభావంపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మవద్దని పిలుపు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 17 Oct 2026 5:10 PM IST
Wardhannapet
X

Wardhannapet: పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు!

వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన 34 లక్షల 03 వేల 944 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ...

పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు.. వాస్తవాలను తెలుసుకోవాలి.

దేశంలో ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని, తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

నీటి ఎద్దడి ఎదురయ్యే పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని తెలిపారు.అదేవిధంగా, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.దేశంలో ఎల్ నీవో ప్రభావం ఉన్నప్పటికీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రభావం ఉన్నదనే దుష్పచరాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని రైతులకు, ప్రజలు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్,మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, ఐనవోలు దేవస్థానం చైర్మెన్ ప్రభాకర్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాను ప్రసాద్, కౌన్సిలర్లు, పాక్స్ చైర్మన్లు,సర్పంచులు, పట్టణ, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.