Wardhannapet: వర్ధన్నపేటలో గంజాయి కలకలం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్!

Wardhannapet: వర్ధన్నపేటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ అరకు నుంచి తెచ్చిన రూ.50 వేల విలువైన కిలో గంజాయి స్వాధీనం, ఎస్హెచ్‌ఓ సాయిబాబు ఆధ్వర్యంలో రిమాండ్‌కు తరలింపు.

P ASHOK, WARDHANNAPET
Published on: 28 Sept 2026 7:45 PM IST
Wardhannapet
X

Wardhannapet: వర్ధన్నపేటలో గంజాయి కలకలం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్!

వర్దన్నపేట: వర్దన్నపేట మండలం కట్ర్యాల గ్రామనికి చెందిన ముత్యాల శ్యామ్ మరియు వర్దన్నపేట కు చెందిన పిన్నింటి భరత్ ఇద్దరు కలిసి గత రెండు మూడు సంవత్సరాల నుండి గంజాయి అమ్ముతు సేవిస్తూన్నారు.

ఇదే క్రమంలో గత 10 రోజుల క్రితం ముత్యాల శ్యామ్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి వైజాగ్ అరకులో తన పాత..స్నేహితుడు అయినా సుభాష్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఒక ప్యాకెట్ లో ఎండు గంజాయి ని ట్రైన్ లో కాజిపేట్ వరకు తీసుకోని వచ్చి వర్దన్నపేట లో తన స్నేహితులకు అమ్మటానికి ముత్యాల శ్యామ్ మరియు పిన్నింటి భరత్ లు ఇద్దరు కలిసి కాట్ర్యల నుండి వర్దన్నపేటకు ఆటోలో వస్తూ ఇల్లంద గ్రామ శివారు వ్యవసాయ మార్కెట్ వద్దకు రాగ వర్దన్నపేట పోలీస్ వారిని పట్టుకున్నారు వారి వద్ద ఉన్న ఒక కిలో గంజాయి దాని విలువ 50,000/- వరకు ఉంటుంది.

వారు ఉపయోగించిన jio bharat కీ ప్యాడ్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని నిందుతులను అదుపులోకి తీసుకోని పూర్తి వివరాలు సేకరించి ఇద్దరిని రిమాండు కు తరలించారు . ఈ సందర్బంగా వర్దన్నపేట SHO N. సాయిబాబు మాట్లాడుతూ వర్దన్నపేట మండలం పరిదిలో ఎవరు అయినా గంజాయి లేదా మత్తు పదార్థాలు తరలించిన అమ్మిన సేవించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET