Dornakal: డోర్నకల్‌లో వినాయక నిమజ్జనానికి నీటి కష్టాలు!
Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో గణేష్ నిమజ్జనానికి నీటి కష్టాలు. చెరువులు, కుంటలు అడుగంటిపోవడంతో ఆందోళన చెందుతున్న భక్తులు, నిర్వాహకులు.
Dornakal: డోర్నకల్‌లో వినాయక నిమజ్జనానికి నీటి కష్టాలు!
Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వినాయక నిమజ్జనానికి నీటి కొరత భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన భక్తులకు ప్రస్తుతం నిమజ్జన కష్టాలు ఎదురవుతున్నాయి.
వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు, బావులు నీరు లేక అడుగంటిపోయాయి. దీంతో గణనాథుల నిమజ్జనానికి నీటి వసతి లేక ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నిమజ్జన ఘట్టానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో వరుణుడు కరుణిస్తాడా? లేక ప్రత్యామ్నాయంగా నిమజ్జన ఏర్పాట్లు చేయాల్సి వస్తుందా? అనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. అధికారులు స్పందించి నిమజ్జనానికి అవసరమైన నీటి వసతిని కల్పించాలని భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు.




