Mahabubabad: మహబూబాబాద్‌ అండర్ బ్రిడ్జి జలమయం.. వాహనదారుల పాట్లు!

Mahabubabad: మహబూబాబాద్ పట్టణంలో వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి జలమయం. మోకాళ్ల లోతులో నిలిచిన నీటితో వాహనదారుల ఇబ్బందులు.

A.Rajkumar, Mahabubabad
Published on: 14 Jun 2026 1:07 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌ అండర్ బ్రిడ్జి జలమయం.. వాహనదారుల పాట్లు!

మహబూబాబాద్ జిల్లా: అండర్ బ్రిడ్జి లోకి చేరిన వర్షం నీరు రాకపోకల కు అంతరాయం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎండ వేడి , ఉక్క పోత తో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వర్షం తో వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగింది.

ఈ చిన్నపాటి వర్షానికి మహబూబాబాద్ పట్టణం లోని రైల్వే అండర్ బ్రిడ్జి లో వర్షపు నీరు మోకాళ్ల లోతుకు చేరడంతో వాహనదారులు, పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలు మధ్యలోనే నిలిచిపోవడంతో నెట్టుకుంటూ వెళ్లారు.

వర్షం వచ్చిన ప్రతి సారి నీరు నిలుస్తుంధని, మున్సిపల్ అధికారులు నీరు నిలవకుండా చర్యలు తీసుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story