Gudur: భర్తను హతమార్చిన భార్య.. మహబూబాబాద్‌లో కలకలం!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో దారుణం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తన భర్తను బండరాయితో హత్య చేసింది.

B NARASIMHA, GUDUR
Published on: 18 Jun 2026 1:10 PM IST
Gudur
X

Gudur: భర్తను హతమార్చిన భార్య.. మహబూబాబాద్‌లో కలకలం!

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పరిధిలోని రామ్ సింగ్ తండాలో గురువారం తీవ్ర కలకలం రేగింది. నిత్యం జరిగే కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో ఓ భార్య తన భర్తను కడతేర్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఘటనకు సంబంధించిన వివరాలు

పోలీసులు స్థానికుల కథనం ప్రకారం రామ్ సింగ్ తండాకు చెందిన బోడ లాలు భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రోజువారీ లాగే గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య, విచక్షణ కోల్పోయి రాత్రి అందాజు మూడు గంటల సమయంలో అందుబాటులో ఉన్న బండరాయితో భర్తపై దాడి చేసి తలపై మోదడం తో. తీవ్రంగా గాయపడిన భర్త లాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

రంగంలోకి దిగిన పోలీసులు:

సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకటన:

"కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. అని గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.

ఈ ఘటనతో రామ్ సింగ్ తండాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నపాటి వివాదాలు ఇంతటి దారుణానికి దారితీయడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story