Parakala: గొడవ ఆపే క్రమంలో తోపులాట.. మహిళా కానిస్టేబుల్ చేయి ఫ్రాక్చర్!

Parakala: హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజీపేటలో దసరా వేడుకల గొడవను ఆపేక్రమంలో తోపులాట జరిగి విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ చేయి విరిగింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 21 Oct 2026 9:32 AM IST
Parakala
X

Parakala: గొడవ ఆపే క్రమంలో తోపులాట.. మహిళా కానిస్టేబుల్ చేయి ఫ్రాక్చర్!

Parakala: పరకాల మండలం రాజీపేటలో దసరా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దసరా వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవను ఆపే ప్రయత్నంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కు చేయి విరిగింది.

గొడవ జరుగుతుండగా నియంత్రించే క్రమంలో తోపులాట జరిగి ఆమె కిందపడటంతో చేయి విరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సహచర సిబ్బంది ఆమెను పరకాల 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL