Kesamudram: సమృద్ధిగా వర్షాలు కురవాలి: బొడ్రాయి వద్ద మహిళల ప్రార్థనలు!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామ మహిళలు బొడ్రాయికి జలాభిషేకం చేసి, వాన పాటలతో కోలాటాలు ఆడారు.
Kesamudram: సమృద్ధిగా వర్షాలు కురవాలి: బొడ్రాయి వద్ద మహిళల ప్రార్థనలు!
మహబూబాబాద్ జిల్లా: కేసముద్రంలో వర్షాలు కురవాలంటూ మహిళలు బొడ్రాయికి జలాభిషేకం చేసి , వాన పాటలు పాడుతూ కోలాటాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామం లోని మహిళలు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేశారు.
అనంతరం వానదేవుడిని ప్రసన్నం చేసేందుకు కోలాటాలు వేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ వేముల భారతి శ్రీనివాస్ రెడ్డి, సుభద్ర తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు
Next Story




