Mulugu: ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభం!

Mulugu: ములుగు జిల్లాలోని 640 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 Aug 2026 6:58 PM IST
Mulugu
X

Mulugu: ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభం!

ములుగు: ఈ రోజు నుండి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1–7) ములుగు జిల్లాలోని 640 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ (అంగన్‌వాడీ) సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రాబోయే 10 రోజుల పాటు SHG సమాఖ్య సంఘాల మహిళలకు, అలాగే డిగ్రీ, నర్సింగ్ మరియు మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టబడతాయి.

తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు, పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, తల్లి మరియు శిశువు ఆరోగ్యానికి తల్లిపాల ప్రాధాన్యత, సరైన పోషకాహారం, శిశు సంరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించబడుతుంది.

ములుగు జిల్లాలో ప్రస్తుతం 1,429 మంది గర్భిణులు మరియు 682 మంది బాలింతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చురుకుగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి శ్రీమతి ఈ.పీ. ప్రేమలత గారు మరియు సంబంధిత అధికారులు కోరారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story