Rayaparthi: 30 ఏళ్ల తర్వాత రాయపర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!
Rayaparthi: రాయపర్తి జెడ్పీహెచ్ఎస్ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత వల్మిడి సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో కలుసుకున్నారు.
Rayaparthi: 30 ఏళ్ల తర్వాత రాయపర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!
రాయపర్తి, అక్టోబర్ 4: ZPHS రాయపర్తి పాఠశాలలో 1995–96 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వల్మిడి సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యను పూర్తి చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ రీయూనియన్‌లో సుమారు 68 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.
ముందుగా సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న పూర్వ విద్యార్థులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో అసెంబ్లీ నిర్వహించిన రోజులను గుర్తు చేసుకుంటూ అందరూ కలిసి వందేమాతరం ఆలపించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తమ పాఠశాల నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ జీవితంలోని అనుభవాలను, ఆనాటి పాఠశాల జ్ఞాపకాలను, ఆత్మీయ అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. చిన్ననాటి స్నేహితులు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే చోట కలుసుకోవడంతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది.
అనంతరం ఆటలు, పాటలు, సరదా కార్యక్రమాలతో పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. పాత స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు తమ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్, రంగు కుమార్, ఉదయ్ చందర్, పెందోట వెంకన్న, కొంగ వెంకన్న, సుంచు సంతోష్, ఈరెడ్డి వెంకట్ రెడ్డి, రొడ్డ రాజేందర్, కె. శ్రీనివాస్, ఐత సంధ్యారాణి, మామిడాల శశికళ, ఆరుట్ల జ్యోతి, హైమావతి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.




